హోటల్లు మూసివేత...జిహెచ్‌ఎంసి కఠిన చర్యలు

SMTV Desk 2019-01-06 18:49:04  GHMC, Hyderabad city, Kookatpally, Hotels seize

హైదరాబాద్, జనవరి 6: నగరంలో కుకట్‌పల్లి జోనల్‌ లో పలు హోటళ్ళను సీజ్ చేసినట్టు ఆ జోనల్‌ కమిషనర్‌ శంకరయ్య తెలిపారు. వివరాల ప్రకారం బల్క్‌ గార్బేజ్‌ను ఉత్పిత్తి చేసే హోటళ్లు, రెస్టారెంట్‌లు కంపోస్టు యూనిట్లు ఏర్పాటు చేయాలని జిహెచ్‌ఎంసి ఇచ్చిన గడువులోగా కంపోస్టు యూనిట్లను ఏర్పాటు చేయని నాలుగు హోటళ్లను సీజ్‌ చేశామని కమిషనర్‌ శంకరయ్య తెలిపారు.

కుకట్‌పల్లి జోన్‌లో భారీ పరిమాణంలో చెత్తను, ఆహార వ్యర్థాలను ఉత్పత్తి చేసే, హోటళ్లు, రెస్టారెంటులు, ఫంక్షన్‌హాళ్లు తప్పనిసరిగా కంపోస్టు యూనిట్లను ఏర్పాటు చేయాలని నోటీసులు, ప్రత్యేక సమావేశాలు ద్వారా పలుమార్లు తెలియజేసినప్పటికీ నిర్లక్ష్యం వహించినా హోటళ్లు సీజ్‌ చేసినట్లు తెలిపారు. కుకట్‌పల్లి సర్కిల్‌లోని గ్రీన్‌ బార్చీ, ఘుమఘుమలు హోటల్‌, మూసాపేట సర్కిల్‌లోని కోహినూర్‌, ఆరేబియన్‌ మండి హోటళ్లను మూసివేసినట్లు ఆయన వెల్లడించారు.