పవన్ తో అలీ భేటీ...!!!

SMTV Desk 2019-01-06 16:50:34  Ali, Pawan kalyan, Janasena, YSRCP

అమరావతి, జనవరి 6: వైసీపీ తీర్థం తీసుకోవడానికి సిద్దంగా ఉన్న ప్రముఖ హాస్యనటుడు అలీ ఇవ్వాల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. రెండు గంటల పాటు పవన్ కళ్యాణ్‌తో అలీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సుమారు రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని అలీకి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలీ రాజకీయ భవిష్యత్తుకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

అలీ ఈ నెల 9 న వైసీపీ లోకి వెళ్తున్నారని అనేక వార్తలు వస్తున్నాయి. అదే రోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర కూడా ముగిసిపోతుంది. అయితే అలీ పవన్ తో భేటీ కావడం రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. జనసేన నేత ముత్తంశెట్టి కృష్ణారావు అలీని ఇవాళ పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకెళ్లారు. పవన్‌ కళ్యాణ్ ‌కు అలీ అత్యంత సన్నిహితుడు. పవన్ సినిమాల్లో అలీకి తప్పకుండా ఓ పాత్ర ఉంటుంది.