బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్....

SMTV Desk 2019-01-06 15:57:01  Kastoriba girls hostel, Food poison, Students

చేవేళ్ల, జనవరి 6: నగరంలోని బాలికల వసతి గృహంలో 60 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వివారాల ప్రకారం చేవేళ్ల కస్తూర్బా హాస్టల్ లో‌ సుమారు 200 మంది విద్యార్ధినులు ఉంటారు. రాత్రి పూట వీరందరికి ప్రూట్ సలాడ్ ఇచ్చారు ప్రూట్ సలాడ్ ఇచ్చిన కొంత సేపటికే భోజనం ఇచ్చారు. అయితే ఇది తిన్న కొద్దిసేపటికే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని హాస్టల్ నిర్వాహకులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. వాంతులతో విద్యార్థినులు ఇబ్బందిపడుతున్న దృశ్యాలను చూసిన మిగిలిన వారు ఈ భోజనం చేయలేదు. హాస్టల్ నిర్వాహకులు వెంటనే బాధిత విధ్యార్థినులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకొన్నారు. హాస్టల్ నిర్వాహకులపై మండిపడ్డారు.