బెంగుళూర్ నుండి పోటీ : ప్రకాష్ రాజ్

SMTV Desk 2019-01-06 12:18:57  Prakash raj, Actor, Parliament elections, Bengulur, Independent

బెంగళూరు, జనవరి 6: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే విషయం మాత్రం ఎవరికీ చెప్పలేదు. కాగా తాజగా తాను బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంటుు పోటీ చేస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ ఈ రోజు ట్వీట్ చేశారు. కొత్త ప్రయాణంలో తనకు అండగా నిలబడుతున్నవారికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు. కాగా, ప్రకాశ్ రాజ్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ స్థానం నుంచి బీజేపీ నేత పీసీ మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీపై, మోదీపై ఆయన తరచూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘సిటిజన్‌ వాయిస్‌ ఎన్జీవో ద్వారా సామాజిక చైతన్యం తీసుకొస్తున్నాని చెబుతున్న ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో పలు సేవాకార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.