కేసీఆర్ వల్లే కోమటి రెడ్డి ఓటమి..???

SMTV Desk 2019-01-06 11:37:51  Komati reddy venkat reddy, Congress party, TRS, KCR, Assembly elections

హైదరాబాద్, జనవరి 6: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయ పాలైన కాంగ్రెస్ పార్టీ నేతలు వొక్కక్కరూ తమ ఓటమికి వాళ్ళు వీళ్ళు కారణం అంటూ ప్రత్యర్డులపై సాకులు చెపుతున్నారు. అయితే శనివారం సాయంత్రం మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో సమావేశయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి పొత్తులతో పాటు తెరాస అధినేత కేసీఆర్ పదునైన ప్రసంగాలే కారణమని అసెంబ్లీ ఎన్నికల్లో వొంటరిగా పోటీ చేస్తే కనీసం 40 నుంచి 45 స్థానాలైనా గెలిచేవాళ్లమన్నారు. మహా కూటమి వద్దని మొదట నేనే వ్యతిరేకించానని పేర్కొన్నారు. ఈ విషయమై ఎన్నికల కంటే ముందే అధిష్టానానికి చెప్పానని, అయినప్పటికీ పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. పొత్తుల కారణంగా టికెట్​ ఎవరి వస్తుందో అని ప్రజలు అయోమయానికి గురైయ్యారన్నారు.

సీట్ల సర్దుబాటు బాగా ఆలస్యం కావడంతో అదే సమయంలో ‘సీట్లే పంచుకోలేని వాళ్లు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారంటూ కేసీఆర్‌ చేసిన ప్రసంగాలు ఓటర్ల పై తీవ్ర ప్రభవం చూపాయన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజా కూటమి గెలిస్తే ఇటు అమరావతి, అటు ఢిల్లీ నుంచి సాగిస్తారని తెరాస చేసిన ప్రసంగం ప్రజల్లోకి బాగా వెళ్లిందన్నారు. తనను ఓడించేందుకు కేసీఆర్‌ నల్గొండ నియోజకవర్గంలో రెండు సార్లు ప్రచారం చేశారని గుర్తు చేశారు. నల్గొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్‌ మాటలను ప్రజలు నమ్మారని, అందుకే తాను ఓడిపోయానని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పొత్తు లేకపోతే 7 లేదా 8 స్థానాలలో కాంగ్రెస్‌ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఏది ఏమైన ప్రజల తీర్పుని గౌరవిస్తామన్నారు.