కేసీఆర్ కు దుబాయ్ నుండి ఆహ్వానం

SMTV Desk 2019-01-05 19:49:42  CM, KCR, Dubai, Telangana, International investors

హైదరాబాద్, జనవరి 5: దుబాయ్ లో ఈ నెల 6 నుంచి 13 వరకు జరగనున్న అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరు కావాలని నిర్వాహకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ కు ఆహ్వానం పంపారు.

దీనికి హాజరు కావాలని సిఎం కెసిఆర్‌ మొదట్లో నిర్ణయించుకున్నారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు జరిగినా రాష్ట్రంలో పూర్తిస్థాయి మంత్రివర్గం లేకపోవడం, వారం రోజుల పాటు పర్యటన ఉండడం వల్ల సీఎం వెళ్తారా? లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది.