'వినయ విధేయ రామ' సెన్సార్ పూర్తి..

SMTV Desk 2019-01-05 19:26:08  Ram Charan, Vinaya Vidheya Rama, Boyapati Srinu, kiara advani, senssor, U/A

హైదరాబాద్, జనవరి 5: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన వినయ విధేయ రామ. ఈ సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చరణ్, బోయపాటి కాంబినేషన్లో తొలిసారిగా వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. చరణ్ యాక్షన్ .. కైరా గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా వివేక్ వొబెరాయ్ నటించగా, స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. రామ్ చరణ్ ఇంతకుముందు చేసిన రంగస్థలం పెద్ద హిట్ కావడంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.