సినిమాకే హైలెట్ గా నిలవనున్న ఫైట్...

SMTV Desk 2019-01-05 18:13:12  Ram Charan, Vinaya Vidheya Rama, Boyapati Srinu, kiara advani, Ajar baijan fight

హైదరాబాద్, జనవరి 5: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన వినయ విధేయ రామ. ఈ సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చరణ్, బోయపాటి కాంబినేషన్లో తొలిసారిగా వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కాగా, ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన వొక విషయం బయటికి వచ్చింది. ఈ సినిమా కోసం చరణ్ అజర్ బైజాన్ లో వొక యాక్షన్ ఎపిసోడ్ చేశారట. భారీ క్రేన్లు .. డ్రోన్లు .. అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించి ఈ యాక్షన్ ఎపిసోడ్ ను దర్శకుడు బోయపాటి అద్భుతంగా చిత్రీకరించాడని సమాచారం. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. బోయపాటి ఇంతవరకూ చేసిన యాక్షన్ సీన్స్ కి మించి ఈ సీన్ ఉంటుందని అంటున్నారు.