సుష్మాస్వరాజ్ పై పాక్ మహిళ ప్రశంసల జల్లు!!

SMTV Desk 2017-07-28 12:02:27  Indian Foreign Minister Sushma Swaraj, pakisthan, women hijaj, medical visa

న్యూఢిల్లీ, జూలై 28 : భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ చేసిన సహాయానికి పాక్ మహిళ కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే, పాకిస్తాన్ కి చెందిన హిజాజ్ అనే మహిళ కాలేయ సమస్యతో బాధపడుతోంది. ఆమె వీలైనంత త్వరగా భారత్‌లో చికిత్స చేయించుకోవాల్సి ఉంది. దీంతో హిజాబ్‌ మెడికల్‌ వీసా కోసం ఇస్లామాబాద్‌లోని డిప్యూటీ హై కమిషనర్‌ను ఆశ్రయించింది. కానీ ఇందుకు ఆయన ఒప్పుకోలేదు. దీంతో హిజాబ్‌ సుష్మా స్వరాజ్‌ కు విషయాన్ని ట్విట్టర్ లో తెలిపింది. ఆమె వెంటనే స్పందించి, మెడికల్‌ వీసా వచ్చేలా డిప్యూటీ హై కమిషనర్‌ను ట్విటర్‌లో ఆదేశించింది. ఈ మేరకు దరఖాస్తుకు అనుమతినిచ్చిన సుష్మాస్వరాజ్ కు హిజాబ్ మహిళ ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు.