బాబాయికి నచ్చని పని నేను ఎప్పుడూ చేయను: చరణ్

SMTV Desk 2019-01-05 17:54:27  Ram Charan, Vinaya Vidheya Rama, pavan kalyan

హైదరాబాద్, జనవరి 5: బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ కధానాయకుడిగా తెరకెక్కుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ వినయ విధేయ రామ. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సందర్బంగా చెర్రీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చిత్రానికి సంబంధించిన పర్సనల్ విషయాలను పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో తన బాబాయి పవన్ కల్యాణ్ అడగాలే కానీ దేనికైనా రెడీ అని వెల్లడించాడు. ‘పవన్‌ బాబాయికి ఎలాంటి సహకారానికైనా నేను ముందుంటాను. ఎందుకంటే.. ఆయన నా బాబాయి. ఆయన అడగాలే కానీ ఏదైనా చేస్తాను. ఆయనకు నచ్చని పని నేను ఎప్పుడూ చేయను. ఆయన నుంచి వొక్క ఫోన్‌కాల్‌ వస్తే చాలు మేమంతా పరిగెత్తుకుంటూ వెళ్లి చేస్తాం. ఆయన మాకు అంత దగ్గర అని చెర్రీ చెప్పుకొచ్చాడు.