నాగబాబుకు బాలయ్య అభిమానుల కౌంటర్

SMTV Desk 2019-01-05 17:45:48  Nagababu, Balakrishna, Chennai, Ego war

హైదరాబాద్, జనవరి 5: కొణిదెల నాగబాబుకు నందమూరి బాలకృష్ణకు ఇగో వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెర్సనల్ వార్ కాస్త ఇప్పుడు అభిమానులకు పాకింది. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా బాలయ్య,, నాగబాబుల మధ్య సెటైర్ల యుద్ద నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ, బాలయ్య ఎవరో తనకు తెలీదని నాగబాబు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అక్కడితో ఆగకుండా నాగబాబు బాలకృష్ణ మీద తరచూ సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ గా ఏదో వొక సెటైర్ వేస్తూనే ఉన్నారు.

ఆయన సెటైర్లకు నందమూరి అభిమానులు కూడా అదే రీతిలో సమాధానం చెబుతున్నారు. కాగా తాజాగా చెన్నైలో నాగబాబుపై బాలయ్య అభిమానులన నిరసన వ్యక్తం చేశారు. నాగబాబు చెన్నైలోని ఓ కాలేజీ లో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఆ కార్యక్రమంలో నాగబాబు మైక్ అందుకొని మాట్లాడటం మొదలుపెట్టగానే కొందరు విద్యార్థులు‘‘బాలయ్య..బాలయ్య అంటూ నినాదాలు చేశారు. వారి నినాదాలకు నాగబాబు అసహనం వ్యక్తం చేశారు.