రూ. 2వేల నోట్ల ముద్రణను నిలిపివేసిన కేంద్రం..

SMTV Desk 2019-01-05 15:31:55  2000 Notes, printing stop, central govt.

న్యూఢిల్లీ, జనవరి 5: 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి వచ్చిన 2వేల రూపాయల నోట్ల ముద్రణ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అధికారికంగా ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో రూ. 2వేల నోట్లు తగిన స్థాయిలో ఉన్నాయని... అందువల్ల వాటి ముద్రణను నిలిపివేశామని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.భారత దేశ మొత్తం కరెన్సీలో 35 శాతానికి పైగా రూ.2వేల నోట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో అవసరాలను అంచనా వేసి, కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రణాళిక రచిస్తామని తెలిపారు.