ఎక్కువ థియేటర్లు సొంతం చేసుకుంటున్న చరణ్..

SMTV Desk 2019-01-05 12:55:48  Ram Charan, Vinaya Vidheya Rama, NTR Biopic, F2, Petta

హైదరాబాద్, జనవరి 5: 2019 సంక్రాంతికి థియేటర్ల దగ్గర సందడి వొక రేంజ్ లో కనిపించనుంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడు .. రామ్ చరణ్ వినయ విధేయ రామ .. వెంకటేశ్ ఎఫ్ 2 వరుసగా థియేటర్లలోకి దిగనున్నాయి. వీటితో పాటు సూపర్ స్టార్ రజని కాంత్ పెట్ట కూడా పోటీపడనుంది. ఎన్టీఆర్ సినీ ప్రస్థానంగా కథానాయకుడు , యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చరణ్ మూవీ, పూర్తి వినోద భరిత చిత్రంగా ఎఫ్ 2 , పూర్తి యాక్షన్ నేపథ్యంలో పెట్ట ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

రామ్ చరణ్ ఇంతకుముందు చేసిన రంగస్థలం పెద్ద హిట్ కావడంతో, ఈ మూడు సినిమాల్లో చరణ్ సినిమా పట్ల ఎగ్జిబిటర్లు ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నారట. ఈ కారణంగా ఈ సినిమాకి ఎక్కువ థియేటర్లు దక్కనున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. సంక్రాంతి పండుగ బరిలో నిలిచే సినిమాలో ఉండవలసిన మాస్ మసాలా కంటెంట్ ఈ సినిమాలో ఎక్కువగా ఉండటమే అందుకు కారణమని తెలుస్తోంది. ఈ నాలుగు సినిమాలు భిన్నమైన జోనర్లకి సంబంధించినవి కావడంతో, అన్ని సినిమాలకి మంచి వసూళ్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.