నేను ప్రవాహం లాంటి వాడిని : పవన్

SMTV Desk 2019-01-04 20:54:36  Janasena party, Pawan kalyan, Amaravati

అమరావతి, జనవరి 4: ఇవాళ అమరావతిలో పార్టీ కార్యకర్తలతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రవాహం లాంటి వాడినని తనను ఎవరూ కూడ ఆపలేరని అన్నారు. వొకటి రెండు కులాలను అడ్డు పెట్టుకొని విజయం సాధించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి, పొట్టిశ్రీరాములు, నెల్లూరు జిల్లాల కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. కులం పేరు చెప్పి వ్యక్తులు లాభపడుతున్నారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలు వచ్చే సలహాలు ఇవ్వాలని పవన్ పార్టీ కార్యకర్తలను కోరారు.

వ్యక్తిగతంగా పదివేల ఓట్లు వచ్చే వారిని అక్కున చేర్చుకొంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు. కులం పేరు చెప్పి కొందరు వ్యక్తులు లాభపడుతున్నారని కానీ కులాలు మాత్రం బాగుపడడం లేదన్నారు. బాధ్యత, ఓపిక, సహనం ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తామని చెప్పారు. ఓపిక, సహనం ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తామన్నారు. చిన్ననాటి నుండి ఈ లక్షణాలు అలవర్చుకొని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ ‌కళ్యాణ్ చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని జనసేనను విస్తరించే ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.