ఒంటరిగా అనిపిస్తే ఇలా చేయండి అంటున్న వర్మ..

SMTV Desk 2019-01-04 19:07:22  Ram Gopal Varma, Lakshmis NTR, Twitter

హైదరాబాద్, జనవరి 4: మాములుగా చాలామంది తాము వొంటరివాళ్లం అయ్యామనీ, తమకు అండగా ఎవరూ లేరని బాధపడుతుంటారు. అలాంటి వ్యక్తులను ఉద్దేశించి వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు ట్విట్టర్ లో స్పందించారు. ‘మీకు జీవితంలో ఎప్పుడైనా వొంటరిగా ఉన్నామనీ, మన వెనుక ఎవ్వరూ లేని అనిపించిందనుకోండి. వెంటనే వొంటరిగా కూర్చుని ఓ హర్రర్ సినిమా చూసెయ్యండి. అప్పటి నుంచి మీ వెనుక ఎవరో ఉన్నారని మీరు ప్రతీక్షణం ఫీల్ అవుతారు అంటూ సరదాగా ట్వీట్ చేశారు. వర్మ ప్రస్తుతం దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.