తిరుమలలో ఆర్జిత సేవా టికెట్లు విడుదల

SMTV Desk 2019-01-04 19:00:21  TTD, Aarjitha seva, Ticket price

తిరుమల, జనవరి 4: ఏప్రిల్ నెలకు సంభందించిన 63,311 ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేస్తూ తితిదే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఇందులో 10,061 టికెట్లను ఆన్‌లైన్‌ డిప్‌ విధానానికి కేటాయించారు. డిప్‌ పద్ధతిలో సుప్రభాత సేవా 7,836, తోమాల సేవకు 130, అర్చన 130, అష్టదళ పాదపద్మారాధన సేవకు 240, నిజపాదదర్శనం 1725, విశేష పూజకు 2500 టికెట్లను కేటాయించింది. సాధారణ పద్ధతిలో 53,250 టికెట్లను కేటాయించగా అందులో కల్యాణోత్సవం 11,875, ఊంజల్‌ సేవకు 3,750, వసంతోత్సవానికి 12,650, సహస్ర దీపాలంకారణ సేవ 15,600, ఆర్జిత బ్రహ్మోత్సవానికి 6,875 టికెట్లు అందుబాటులో ఉంచారు. గతంలో చోటుచేసుకున్న అక్రమాలను అరికట్టేందుకు రిజిస్ట్రేషన్‌లో మార్పులు తీసుకువచ్చారు. వొక ఈ-మెయిల్‌, ఫోన్‌ నంబరు ఆధారంగా వొకే రిజిస్ట్రేషన్‌కు తితిదే అవకాశం కల్పించింది.