రాజకీయ ప్రవేశానికి సిద్దం అయిన సినీ నటుడు...???

SMTV Desk 2019-01-04 18:51:17  Shivaji, Actor, TDP, AP

అమరావతి, జనవరి 4: శుక్రవారం మీడియాతో ప్రముఖ సినీ నటుడు శివాజీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో విపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాక రాజకీయ రంగ ప్రవేశం గురించి తన అభిప్రాయాన్ని ప్రకటించారు. రాజకీయాల్లో వస్తానని తేల్చి చెప్పారు. ఏపీలో విపక్ష పార్టీ వైసీపీ తన పాత్రను సక్రమంగా నిర్వహించడం లేదని శివాజీ ఆరోపించారు. వైసీపీపై విమర్శలు చేస్తున్న సమయంలో టీడీపీలో చేరుతారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే తనకు టీడీపీలో చేరే హక్కు లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీలో చేరితే తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై కుట్రలు జరుగుతున్నాయని శివాజీ మరోసారి ఆరోపణలు చేశారు. తాను ప్రజల కోసం పోరాటం చేస్తున్నానని ఆయన చెప్పారు. టీడీపీ కోసం తాను పనిచేయడం లేదని మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. తనకు అసెంబ్లీలో అధ్యక్షా అంటూ సంభోదించే హక్కు లేదా అని ఆయన ప్రశ్నించారు.