రూ.200కోట్ల దిశగా టెంపర్ రీమేక్..

SMTV Desk 2019-01-04 18:49:59   Ranveer Singh, Sara Ali Khan, Simba, Taran adarsh

ముంబై, జనవరి 4: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన టెంపర్‌ టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి ఈ చిత్రాన్ని పలు భాషల్లో తెరకెక్కించాలని బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రయత్నించాయి. బాలీవుడ్‌లో రణవీర్‌సింగ్‌ ‘సింబా గా రీమేక్‌ చేశారు. కోలీవుడ్‌లో విశాల్‌ ‘అయోగ్య గా తెరకెక్కిస్తున్నారు. రణవీర్‌సింగ్‌ ‘సింబా చిత్రం గతవారం విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఎన్టీఆర్‌ నటనకు, రణవీర్‌ నటకు పోలిక లేకున్నా.. సినిమా మాత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.

కాగా ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే వందకోట్లు, ఏడు రోజుల్లోనే 150కోట్లను కొల్లగొట్టింది. ఇక ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కాలేదు. అయితే ఇదే జోరును కొనసాగిస్తే.. ‘సింబా 200కోట్లను దాటేసి.. 250కోట్లను వసూళ్లు చేసే అవకాశంఉందని ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సారా అలీఖాన్‌ హీరోయిన్‌గా నటించారు.