నగరంలో జీహెచ్ఎంసీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

SMTV Desk 2019-01-04 15:55:58  GHMC, Hyderabad city, Dana kishore, Mehadipatnam Junction, Raithubazar

హైదరాబాద్, జనవరి 4: నగరంలో పలు చోట్ల జీహెచ్ఎంసీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మెహదీపట్నం జంక్షన్, బస్టాండ్, రైతుబజార్, వాణిజ్య సముదాయాలలో తనిఖీలు చేపట్టారు. పారిశుధ్యంతో పాటు ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడం ఆయన దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో మెహదీపట్నం ప్రధాన కూడలిలో మురుగునీరు రోడ్డుపై ప్రవహించి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలగడం పట్ల సంబంధిత అధికార్లపై గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ కమీషనర్ దాన కిశోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.