'ఎన్టీఆర్' బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు లేడంటే?

SMTV Desk 2019-01-04 13:42:33  NTR Biopic, Balakrishna, Krish, kalyan ram, jr.NTR Role

హైదరాబాద్, జనవరి 4: నందమూరి బాలకృష్ణ హీరోగా దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యన్.టి.ఆర్. ఈ చిత్రాన్ని కథానాయకుడు , మహానాయకుడు రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న కథానాయకుడు రిలీజ్ కాబోతోంది. రెండో భాగం ఫిబ్రవరి 7న విడుదలకానుంది. ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్ నటించకపోవడంపై కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ఇదుగో ఈ పాత్ర చెయ్యి అని తమ్ముడుకి తాతయ్య బయోపిక్ లో ఏ పాత్ర ఇచ్చినా చేసుండేవాడని, అదే జరిగితే నందమూరి అభిమానులు ఇంత చిన్న పాత్ర ఇచ్చారా? అని నిరుత్సాహపడే పరిస్థితి వచ్చుండేదని, అందువల్లే జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో లేడన్నారు.

చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కల్యాణ్ రామ్, తారక్ కు బాలకృష్ణ ఎంతో గౌరవం ఇచ్చారని, ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా పిలిపించి, తన చేతుల మీదుగానే ఆడియోను బయటకు తెచ్చారని గుర్తు చేశాడు. అసలు అంతకన్నా ఇంకేం కావాలని ప్రశ్నించాడు. తాను చిన్నప్పుడు పైలట్ కావాలని అనుకునేవాడినని, బాబాయ్ సినిమాలు చూసిన తరువాతనే నటుడిని కావాలని అనిపించిందని చెప్పాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, మురళీ శర్మ, కళ్యాణ్ రామ్, రానా, సుమంత్, విద్యాబాలన్, నిత్యామీనన్, రకుల్, హన్సిక తదితరులు నటిస్తున్నారు.