చంద్రబాబుకు మరో సవాల్ విసిరిన ఉండవల్లి

SMTV Desk 2019-01-04 12:42:50  Undavalli arun kumar, AP Governament, Central governament, CBI, Congress party, TDP, Chandrababu, IAS

విశాఖపట్నం, జనవరి 4: ఈ మధ్యే రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేత పత్రాలపై బాబుకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చంద్రాబుకు మరో సవాల్ విసిరారు ఉండవల్లి. అయితే ఈ సవాల్ పై తెలుగుదేశం పార్టీ కానీ సీఎం చంద్రబాబు కానీ స్పందించలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆయన శ్వేతపత్రం అంటేనే చర్చ అలాంటిది చర్చలకు ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. శ్వేతపత్రాలపై చర్చ రాజకీయ పార్టీలతో కాకుండా ఐఏఎస్ అధికారులతో చేయించాలంటూ మరో సవాల్ విసిరారు.

అన్ని విషయాలు ప్రజలకు తెలిసేలా చెయ్యండంటూ ఉండవల్లి మితవు పలికారు. తాను చేసిన ఆరోపణలపై స్పందించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును మే నెలలో పూర్తి చేసి నీళ్లు ఇస్తామంటున్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన సెటైర్లు వేశారు. మే నెలలో నీళ్లు ఉండవని ఉండవల్లి గుర్తు చేశారు. ప్రాజెక్టు మెుత్తం పూర్తయినా అప్పుడు కూడా నీళ్లుండవంటూ స్పష్టం చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్