ప్రత్యేక హోదా సమితి కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్

SMTV Desk 2019-01-03 20:14:13  AP, Special status, Parliament, Police left

న్యూఢిల్లీ, జనవరి 3: గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన ప్రత్యేక హోదా సమితి, వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అనంతరం బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. గాయపడిన వారిని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, పి. మధులతో పాటు పలువురు కార్యకర్తలను, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనలో గాయపడిన వామపక్ష పార్టీల నేతలను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఫోన్ లో పరామర్శించారు.