పోలవరంపై సుప్రీం కోర్టులో విచారణ..

SMTV Desk 2019-01-03 18:31:03  Supreme court of India, Delhi, Polavaram Project, Odisha

ఢిల్లీ, జనవరి 3: వొడిశా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వొరిజినల్‌ సూట్‌పై విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవని, స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ని పదే పదే నిలుపుదల చేశారని వొడిశా తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. పర్యావరణ అనుమతులు లేకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారా అని ప్రశ్నించింది. దీనికి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు సూచించింది. సరైన సమాధానం కోసం రెండు ప్రభుత్వాలకు మూడు వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.