రామేశ్వరం నుంచి అయోధ్య కు కొత్త రైలు ప్రారంభం

SMTV Desk 2017-07-27 18:56:56  New train from ayodhya to rameswaram, trains through vijayawada, sradhdha sethu express, rameswaram weekly express from ayodhya

రామేశ్వరం జూలై 27: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, తమిళనాడులోని రామేశ్వరంల మధ్య వీక్లీ రైల్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 16793/16794 నెంబర్లు గల ఈ రైలు “శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్" గా పిలువబడుతుంది. ఆగష్టు 6వ తేదీన రామేశ్వరం నుండి, ఫైజాబాద్ నుంచి ఆగస్టు 9న ఈ రైల్ రెగ్యులర్ సర్వీసు ప్రారంభమవుతాయి. వరంగల్ (తెలంగాణ), విజయవాడ (ఆంధ్రప్రదేశ్), గూడూర్ వద్ద ఆగటం వలన ఈ కొత్త రైలు ద్వారా తెలుగు రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయని అధికార వర్గాల సమాచారం. ఈ రైలు తంజావరం, తంజావూర్, చెన్నై ఎగ్మోర్, గుడూర్, విజయవాడ, వరంగల్, బల్హార్శా, నాగపూర్, ఇటార్సి, జబల్పూర్, అలహాబాద్, జౌన్పూర్, అయోధ్య స్టేషన్ల వద్ద ఆగనుంది. రైలు నెం. 16794 ఫైజాబాద్-రామేశ్వరం (అయోధ్య మీదుగా) ప్రతి బుధవారం 23.05 గంటలకు ఫైజాబాద్ నుంచి బయలుదేరి శనివారం ఉదయం 11.30 గంటలకు రామేశ్వరం చేరుకుంటుంది. రైలు నెంబర్ 16793 రామేశ్వరం-ఫైజాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం ఉదయం 23:50 గంటలకు రామేశ్వరం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు ఫైజాబాద్ చేరుకుంటుంది.