యాత్ర నుంచి జగపతి బాబు ఫస్ట్ లుక్..

SMTV Desk 2019-01-03 17:23:00  Yatra, Mamutti, Jagapathi babu, First look

హైదరాబాద్, జనవరి 3: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా యాత్ర రూపొందుతోంది. మలయాళ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రధారిగా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, మహి.వి రాఘవ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన మమ్ముట్టి పోస్టర్స్ కి .. టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్తగా ఈ సినిమా నుంచి జగపతిబాబు పాత్రకి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు. ఆయన ఎవరిపాత్రలో నటించారనేది రివీల్ చేయలేదు కానీ, డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు.

ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందనే టాక్ మాత్రం వినిపిస్తోంది. ప్రస్తుతం జగపతిబాబుకి గల క్రేజ్, ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందని చెప్పవచ్చు. 70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాను, ఫిబ్రవరి 8వ తేదీన అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నారు.