'ఈ రూమర్ ఎక్కడి నుంచి వచ్చిందండీ బాబూ' : అనసూయ

SMTV Desk 2019-01-03 16:34:52  Anasuya, Anchor, Social media

హైదరాబాద్, జనవరి 3: యాంకర్ అనసూయ బుల్లితెరపైన, వెండితెరపైన తన సత్తా చాటుతోంది. గత సంవత్సరం రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆమె క్రేజ్ ను ఆ పాత్ర మరింతగా పెంచేసింది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో వొక అభిమాని నుంచి "మీరు టీవీ ఛానల్ ను .. సినిమా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టుగా విన్నాము .. వాటిని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు?" అనే ప్రశ్న అనసూయకి ఎదురైంది. అందుకు అనసూయ స్పందిస్తూ .."ఈ రూమర్ ఎక్కడి నుంచి వచ్చిందండీ బాబూ" అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

ఇక ఇతర ప్రశ్నలకి సమాధానంగా... నా కెరియర్లో రంగమ్మత్త పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ పాత్రకి వచ్చిన ప్రశంసలు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాయి. నటనకు .. గ్లామర్ కి ప్రాధాన్యత గల పాత్రలనే అంగీకరిస్తాను. వెంకటేశ్ గారితో కలిసి నటించాలనే కోరిక ఎఫ్ 2 సినిమాతో తీరింది. ట్విట్టర్లో రోజుకి 20 నుంచి 25 మందిని బ్లాక్ చేస్తుంటాను" అని అనసూయ చెప్పడం కొసమెరుపు.