షూటింగ్ లో 'చేప ఫ్రై' చేసిన ఉపాసన.. ఎవరి కోసం?

SMTV Desk 2019-01-03 16:19:27  Ram Charan, Vinaya Vidheya Rama, Shooting, Upasana, Making fish fry

హైదరాబాద్, జనవరి 3: హీరో రాంచరణ్ భార్య ఉపాసన షూటింగ్ స్పాట్లో చేప ఫ్రై తయారు చేశారు, ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ కు సంబంధించిన ఎన్నో విషయాలను ఉపాసన సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం తెలిసిందే. తాజాగా, చరణ్ కొత్త చిత్రం వినయ విధేయ రామ లొకేషన్లో చరణ్ కోసం ఆమె చేప ఫ్రై తయారు చేశారు. ఉప్పును వాడకుండా... ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో ఆమె ఈ డిష్ ను తయారు చేశారు. ఈ వంటకం తయారీలో ఉపాసనకు చరణ్ కూడా సాయం అందించాడు. ఆ తర్వాత ఫిష్ కు తోడుగా బంగాళాదుంప, వెల్లుల్లిలను ఆమె జత చేశారు. మరో విషయం ఏమిటంటే పక్కనున్న కాలువ నుంచి చరణ్ అసిస్టెంట్ ఈ చేపను పట్టుకొచ్చాడు