రేవంత్ కు దిమ్మతిరిగే కౌంటర్ లు ఇచ్చిన కేటీఅర్

SMTV Desk 2019-01-03 15:28:53  KTR, Revanth reddy, TRS, Congress party

హైదరాబాద్, జనవరి 3: బుధవారం సనత్ నగర్ లో టీఆర్ఎస్ విజయోత్సవ సభలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏవేవో చెప్పిన ఆ నేత, ఫలితాలు వచ్చిన తర్వాత లేవడం లేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో అంతలేదు ఇంత లేదు అంటూ నానా హంగామా చేశారని ఫలితాలు వచ్చే సరికి ఏం చెప్పాలో తెలియక కిందా మీదా పడుతున్నారంటూ స్పష్టం చేశారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రజలు గుద్దిన గుద్దుడుకు ప్రజాకూటమి నేతలు ఇప్పటికీ లేవలేదని లేచేపరిస్థితుల్లో లేరని కేటీఆర్ అన్నారు.

అంతేకాక రెండేళ్లు మీడియాకు దూరంగా ఉంటామంటూ రేవంత్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. రెండేళ్లు రాజకీయాల జోలికి రానంటూ బైబై చెప్పేసి టూర్లు తిరుగుతున్నారంటూ ఘాటుగా విమర్శించారు. మీడియాకు కూడా గుడ్ బై చెప్పేశారని విమర్శించారు. ఓటమికి గల కారణాలు ఏం చెప్పాలనో తెలియడం లేదన్నారు. మరికొంతమంది ఏం చెప్పాలో తెలియక ఆగమాగం అవుతున్నారన్నారు. కొందరైతే ఈవీఎం మిషన్లు సరిగ్గా లేవంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్సోళ్లు చెప్పినట్లు మిషన్లు కాదో బాగోలేనివి వాళ్ల బుర్రలు పనిచెయ్యడం లేదని విమర్శించారు. ప్రజలు ఇంత దారుణంగా తిరస్కరించారని చెప్పి కిందా మీద పడుతున్నారంటూ సెటైర్లు వేశారు.

మరోవైపు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు మాట్లాడిన తీరు చూసి అబ్బా ఇంత సీను ఉందా అనుకున్నానని తెలిపారు. ఎన్నికల సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చి ఇష్టం వచ్చినప్పుడు తాను వొక్కటే మాట్లాడానని బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో 100మందికి డిపాజిట్లు దక్కవని చెప్పానని కానీ 103 మందికి డిపాజిట్లు దక్కలేదన్నారు.