కేటీఆర్‌ను కలిసిన సినీ నటుడు ప్రకాష్ రాజ్

SMTV Desk 2019-01-02 20:06:27  KTR, Prakash raj, TRS, Actor, Politician

హైదరాబాద్, జనవరి 2: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈ రోజు హైద్రాబాద్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అంతేకాకుండా తన రాజకీయ ప్రయాణానికి కేటీఆర్ స్పూర్తి అని తన రాజకీయ ప్రయాణం ఏ వొక్కరికీ వ్యతిరేకం కాదని ఆయన తేల్చి చెప్పారు. కొత్త ఏడాదిలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకాష్ రాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

గతంలో కేసీఆర్‌తో కలిసి ప్రకాష్ రాజ్ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి, మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడలను కలిశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై ప్రకాష్ రాజ్ గతంలో పలుమార్లు ప్రశంసలు కురిపించారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే విషయమై ఆయన త్వరలోనే వెల్లడించనున్నట్టు ప్రకాష్ రాజ్ చెప్పారు.