ఏపీ, గుజరాత్ ను మించిపోతుందేమోనని మోడీ భయం : చంద్రబాబు

SMTV Desk 2019-01-02 13:19:32  AP, CM, Chandrababu, PM, Narendra modi, Gujarat, Devolopment states

అమరావతి, జనవరి 2: ప్రధాని మోడీ పై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో గుజరాత్ ను మించిపోతుందేమోనన్న ఆక్రోశం మోడిదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలేదని ఆయన విమర్శించారు. తానూ, మోడి ఇద్దరం సిఎంలుగా పనిచేశామని, మోడి ఆహ్మదాబాద్‌కు చేసిందేమి లేదు కానీ నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పారు. ఏపికి సహకరిస్తే అభివృద్ధిలో మించిపోతామనే భయం మోదీదని దుయ్యబట్టారు. హుందాతనం లేకుండా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని, ఎక్కడ నిలదీస్తారో అని రాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారని మండిపడ్డారు.