త్వరలో ముగియనున్న జగన్ ప్రజసంకల్ప యాత్ర

SMTV Desk 2019-01-02 13:10:29  YSRCP, YS Jagan mohan reddy, Sajjala ramakrishna reddy, AP, Praja sankalpa yatra

అమరావతి, జనవరి 2: వైఎస్సార్సీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తాజగా మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ప్రజాసంకల్పయాత్ర జనవరి 9వ తేదితో ముగిస్తుందని వెల్లడించారు. 2017 నవంబరు 6వ తేదిన కడప జిల్లా ఇడుపుల పాయలో ప్రారంభమైన పాదయాత్ర జనవరి 9వ తేదిన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పూర్తికానుందని తెలిపారు. ఇప్పటి వరకు 134 నియోజకవర్గాలలో 120 బహిరంగ సభలు, రెండువేలకు పైగా గ్రామాలు, 3500 కిలోమీటర్ల పైగా పాదయాత్ర సాగిందన్నారు.

2019 జనవరి 9వ తేది ఎంతో చారిత్రాత్మక రోజు అన్నారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన యాత్ర ఆ రోజు ముగుస్తుందన్నారు. పాదయాత్రకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 2వ తేది నుంచి సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించి, పాదయాత్ర లక్ష్యాలను నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రజలకు వివరిస్తారు. వైఎస్సాఆర్‌ చరిపోయిన తరువాత అనే ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. గడిచిన పది సంవత్సరాలలో ఉహించని సమస్యలు, అక్రమ కేసులు, జైలు జీవితం, హత్యాయత్నం వరకు ఎన్నో కష్టాలను జగన్‌ చవిచూశారు. రాష్ట్ర విభజన తరువాత మానవ తప్పిదాలు, అసమర్థకారణంగా రాష్ట్రాభివృద్ధి ఆగిపోయిందన్నారు.

2019 సంవత్సరం ఎంతో కీలకమైందని అవినీతి పరుల పాలనకు చరమగీత పాడి వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి సిఎం కానున్నారని అన్నారు. నాలుగున్న సంవత్సరాలలో ఏమీ చేయని చంద్రబాబు ఎన్నికలకు ముందు హడావుడి చేస్తున్నారన్నారు. చంద్రబాబు తీరు చూస్తే మిగిలినవారందరూ దొంగలు నేనే మంచివాడన్ని చెప్పుకుంటున్నారన్నారు.

కెసిఆర్‌ను నేనే కలువాలనుకున్నారని చెప్పిన చంద్రబాబు ఇతరులు కెసిఆర్‌ను కలిస్తే కుట్ర అంటున్నారు. మా ప్రథమ ప్రత్యర్థి చంద్రబాబు, పరిపాలన పరంగా విభజన జరిగిందే తప్ప ప్రజల మద్య విభజ లేదు. కెసిఆర్‌ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామంటే సంతోషిస్తాం. చంద్రబాబు అసలు నిజస్వరూపాన్ని ఎవరూ బయటపెట్టినా సంతోషిస్తామని వ్యాఖ్యానించారు.