ఆంధ్రలో నేటి నుండి 'జన్మ భూమి మా ఊరు'

SMTV Desk 2019-01-02 12:50:33  AP, Govrnament, CM, Chandrababu, Janma bhomi maa vooru

అమరావతి, జనవరి 2: ఏపీలో నేటి నుండి 11 వ తేది వరకు గత నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై గ్రామస్థాయిలో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జన్మ భూమి మా ఊరు అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రధానంగా రాష్ట్రాభివృద్ధిపై విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై గ్రామసభల్లో చర్చించడంతో పాటు, ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ, గ్రామ స్థాయిలో వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు పురస్కారాల అందజేత, ఆహారోత్సవాలు, 5కె రన్‌, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారు. సమగ్ర గ్రామాభివృద్ధికి సంబంధించిన వ్యూహ ప్రణాళికలను చివరి రోజు విడుదల చేస్తారు. పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా సీఎం చంద్రబాబునాయుడు 13 జిల్లాల్లో పర్యటించనున్నాడు.