తెలుగు లో విడుదల అయినా రజినీకాంత్ 'పేట' ట్రైలర్

SMTV Desk 2019-01-02 12:01:39  Rajinikanth,superstar,Peta,Tamil,Telugu,Simran,Trisha,Trailer

చెన్నయ్ ,జనవరి 2: 2.ఓ తర్వాత సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన తాజా చిత్రం 'పేట' తెలుగు ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించగా, నవాజుద్దీన్ సిద్ధిక్, విజయ్ సేతుపతి, శశికుమార్, త్రిష, సిమ్రన్ లు నటించిన విషయం విదితమే. విషయానికి వస్తే "20 మందిని పంపించాను. అందరినీ చితక్కొట్టి పంపించాడు" అన్న డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. ఆపై కాళీ పరిచయం, వీడు మామూలోడు కాదు మహీ అన్న డైలాగులతో పాటు రజనీ తనదైన స్టయిల్ లో "హహాహా... చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట" అన్న డైలాగ్, ఫైట్ సీన్, సిమ్రన్, త్రిషల పరిచయం సీన్లు ఉన్నాయి. "చూడటానికి చిన్న పిల్లాడిలా చాలా స్టయిల్ గా ఉన్నారు" అని ఓ అమ్మాయి అనగా, "స్టయిల్ గా ఉన్నానంట... నాచురల్లీ" అంటూ రజనీ చేసిన హడావిడి కనిపిస్తుంది. ఆపై హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లలో రజనీ, తన అభిమానులను అలరించే గెటప్పులతో రజిని కనిపించారు. "అందమైన, అద్భుతమైన సంఘటనలు ఇకపై ఎన్నో చూస్తావు" అనే డైలాగ్, "వీడు చావాలి జిత్తూ" అన్న నవాజుద్దీన్ డైలాగ్, "ఏయ్... నిజం చెబుతున్నాను... కొట్టి అండర్ వేర్ తో పరిగెత్తిస్తాను. పరువు పోతే మళ్లీ తిరిగి రాదు చూస్కో" అని రౌడీలతో రజనీ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ అలరిస్తుంది. "ఎవరికైనా పెళ్లాం పిల్లలు అన్న సెంటిమెంట్, గింటిమెంట్ ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి. మండిపోతోంది ఇక్కడ. దొరికారా భస్మమే" అన్న ఇంకో పవర్ డైలాగ్ కూడా ఉంది. చివరిగా మనమేం చేయబోతున్నామన్న ప్రశ్నకు స్వీట్ తినబోతున్నాం అన్న రజనీ సమాధానంతో ట్రైలర్ ముగుస్తుంది.
ఈ ట్రైలర్ చూడగానే సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.