తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

SMTV Desk 2019-01-02 11:05:07  Telangana, Andhrapradesh, Winter, Weather, Temperature

హైదరాబాద్, జనవరి 2: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకి అంచెలంచలుగా పెరుగుతూ పోతుంది. ఉత్తర భారతం నుండి వీస్తున్న శీతల గాలులతో రెండు రాష్ట్రాల్లో చలి తీవ్రత అధికంగా వుంది. కాగా బుధ, గురు వారాల్లో మరింత అధికంగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున ఆదిలాబాద్‌లో 5, మెదక్‌లో 6, రామగుండం, హన్మకొండ, హైదరాబాద్‌లలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట ఇవి మరింతగా దిగజారిపోయాయి.

చలి తీవ్రతకు తెలంగాణలో ఇద్దరు వృద్ధులు మరణించారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ గ్రామానికి చెందిన సదల లస్మన్న, జక్కుల గంగమ్మ చలి తట్టుకోలేక ప్రాణాలు విడిచారు. మరోవైపు ఏపీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. చింతపల్లిలో మంగళవారం 2.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలోని ఆరోగ్యవరంలో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.