చరిత్రలోనే చెత్త సి ఎం కేసీఆర్ ... టీడీపీ ఎమ్మెల్సీ

SMTV Desk 2019-01-01 13:38:45  Tdp MLC,CM Kcr,chethaCM,Andhrapradesh,Telangana,TRS

ఆంధ్ర ప్రదేశ్, జనవరి 1: రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్... ఆంధ్ర కు వచ్చి చంద్రబాబును తిడితే ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ను తిరిగి వెళ్లనివ్వరని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని కేసీఆర్ చెప్పడం, దాన్ని జగన్ సమర్థించడం జరిగిందని... దీంతో బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీల మధ్య ఉన్న లాలూచీ రాజకీయాలు బహిర్గతమయ్యాయని ఆయన తెలిపారు. కేసీఆర్ వాడే భాష సరిగా లేదని... ఆయన వ్యాఖ్యలను సీపీఐ నేత రామకృష్ణ ఖండించారని కూడా చెప్పారు. రాజకీయాలను హుందాగా చేయాలని సూచించారు. చరిత్రలోనే చెత్త ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచిపోతారని ఆయన అన్నారు . రానున్న ఎన్నికల్లో బీజేపీ, వైసీపీలు దారుణంగా ఓడిపోతాయని జోస్యం చెప్పారు .