ఏపీ సీఎం పై తెరాస ఎంపీ సెటైర్ ...!!!

SMTV Desk 2018-12-31 11:20:56  Guttha sukender, Trs, MP,Ap,Chandrababu,Tdp,Aptdp,ApCm,Ysjagan,Bjp

Hyderabad, December 31: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ లీడర్,
నల్గొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ను గద్దె దించాలని చంద్రబాబు చేసిన కుట్రలను తెలంగాణ ప్రజలు గుర్తించారని వ్యాఖ్యానించారు.
బాబు ముసుగు తీసేస్తే కనిపించేది బీజేపీయేనని ఎద్దేవా చేశారు. ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన గుత్తా, ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

అమరావతిలో వొక్కోక్క భవనానికి నాలుగుసార్లు శంకుస్థాపన చేసిన ఘనత చంద్రబాబుదేనని గుత్తా ఎద్దేవా చేశారు.
అక్కడ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ను ఎదుర్కోలేకే చంద్రబాబు ఇలాంటి జిమ్మక్కులు చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు చేసే నాటకాలను ఆంధ్ర, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని దుయ్యబట్టారు.
2019 పార్లమెంటు ఎన్నికల్లో 16 లోక్ సభ స్థానాల్లో తెరాస ఘనవిజయం సాధిస్తామని జోస్యం చెప్పారు.