అల్లూరిగా బాలయ్య...

SMTV Desk 2018-12-30 12:51:57  NTR Biopic, Balakrishna, Krish, New still, Latest still

హైదరాబాద్, డిసెంబర్ 30: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తన కెరీర్ లో చేద్దామనుకుని, చేయలేకపోయిన ఏకైక పాత్ర మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుదేనని ఎన్నోసార్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. తన కోరికను తీర్చుకునేందుకు మేజర్ చంద్రకాంత్ చిత్రంలో వచ్చే ఓ పాటలో కాసేపు అల్లూరిగా కనిపించారు. తాజాగా ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో తన తండ్రి పాత్రను స్వయంగా పోషిస్తున్న బాలకృష్ణ కూడా కొన్ని క్షణాల పాటు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు.

చిత్రం ప్రమోషన్ లో భాగంగా, అల్లూరిగా బాలయ్యను చూపిస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తతం హైలెట్ అయ్యింది. ఈ పోస్టర్ ను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ పోస్టర్‌ లో బాలకృష్ణ అచ్చం ఎన్టీఆర్ మాదిరే కనిపిస్తున్నారని కితాబిస్తూ, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.