కెసిఆర్ ప్రధాని అవుతాడు : కవిత

SMTV Desk 2018-12-30 12:17:25  KCR, CM, KTR, TRS Working president, Kalvakuntla Kavitha, PM

హైదరాబాద్, డిసెంబర్ 30: టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశముందని వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత ఈ మేరకు స్పందించారు.

ఈ నేపథ్యంలో ‘ఫెడరల్ ఫ్రంట్ మెజారిటీ సీట్లతో అధికారంలోకి వస్తే కేసీఆర్ ప్రధాని అవుతారా? అన్న ప్రశ్నకు ... కవిత స్పందిస్తూ.. ‘అప్పటి పరిస్థితి, సందర్భాన్ని బట్టి ఎవరు ప్రధానిగా ఉండాలో నిర్ణయించుకుంటాం. ప్రధాని అయ్యేవాళ్లలో కేసీఆర్ కూడా ఉండొచ్చు. ఆయన కూడా ప్రధాని కావొచ్చు అని తెలిపారు. కాగా ఆమె సోదరుడు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారన్న ప్రశ్నకు స్పందిస్తూ..‘ఇంకా దానికి టైమ్ ఉంది కదండీ. అప్పుడే తొందరేమీ లేదు. ఈ విషయాన్ని మా అన్నగారే చాలాసార్లు చెప్పారు అని అన్నారు.