అసదుద్దీన్ కుమార్తె వివాహానికి హాజరైన పలువురు ప్రముఖులు

SMTV Desk 2018-12-29 20:00:09  Asaduddin owasis, KCR, Daughter marriage, Narasimhan, Mohmad ali, MP Kavitha, Santhosh kumar, Talasani srinivas yadav

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కుమార్తె బర్కత్ ఆలం వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకకు గవర్నర్ నరసింహాన్, ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలవురు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖలు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.