'ఎఫ్ 2' నుంచి 'హనీ ఈజ్ ద బెస్ట్' సాంగ్..!

SMTV Desk 2018-12-29 18:30:18  Venkatesh, Varun tej, Tamannah, Mehreen, F2 Movie

హైదరాబాద్, డిసెంబరు 29: వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా నిర్మితమైంది. వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ కథానాయికలుగా అలరించనున్నారు. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వొక సాంగ్ ను రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ .. మెహ్రీన్ లపై ఈ పాట చిత్రీకరించారు."అయ్యా బాబోయ్ .. అయ్యా బాబోయ్" అంటూ కాలేజ్ నేపథ్యంలో ఈ పాట సరదగా సాగుతోంది. పూర్తిగా కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ పాటను అనిల్ రావిపూడి ఎంతో కలర్ ఫుల్ గా చిత్రీకరించాడు. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి .. సాంగ్స్ కి మాంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.