కాపలాదారునిగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నా : మోడీ

SMTV Desk 2018-12-29 18:09:37  PM, Narendra modi, Congress party, Maharaj suhel dev, Stamps

ఉత్తర్ ప్రదేశ్, డిసెంబర్ 29: భారత ప్రధాన మంత్రి కాంగ్రెస్ పార్టీ పై మరోసారి సంచలన ప్రకటనలు చేశారు. శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మహారాజా సుహేల్‌దేవ్‌‌ స్మారక స్టాంపులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల, ఆ పార్టీ నేతలు చెబుతున్న అసత్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తనను ‘కాపలాదారుడు అంటూ కాంగ్రెస్‌ చేస్తోన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తాను కాపలాదారుడిగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని, దీంతో కొంత మంది దొంగలకు నిద్రపట్టడం లేదని విమర్శించారు.

అలాగే ఆయన విడుదల చేసిన మహారాజా సుహేల్‌దేవ్‌‌ స్మారక స్టాంపుల గురించి మాట్లాడుతూ ‘మహారాజా సుహేల్‌దేవ్‌‌ సేవలకు చిహ్నంగా ఈ రోజు ఈ పోస్టల్‌ స్టాంపులను విడుదల చేశాం. దేశం కోసం పాటుపడిన వారి సేవలను ప్రజలకు గుర్తు చేయడంలో మా ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. ఘాజీపూర్‌లో ఈ రోజు శంకుస్థాపన చేసిన వైద్య కళాశాల ద్వారా వైద్య సదుపాయాలు మరింత మెరుగ్గా అందుతాయి. అని వ్యాఖ్యానించారు.