'ఆర్ఆర్ఆర్' సినిమాలో విలన్ ఎవరు?

SMTV Desk 2018-12-29 17:34:59  SS Rajamouli, NTR, Ram Charan, RRR Movie

హైదరాబాద్, డిసెంబర్ 29: దర్శక దిగ్గజం రాజమౌళి జూ.ఎన్టీఆర్, రాంచరణ్ కథానాయకులుగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసే యోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. రెండు భాగాలుగా సినిమా తీస్తే... నిర్మాతలకు సేఫ్ ఉంటుందని ఆయన యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

కొత్తగా ఈ సినిమాకి సంబంధించి మరో వార్త వినిపిస్తోంది. విలన్ రోల్ ను రానా చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. కాగా కొత్తగా కన్నడ స్టార్ హీరో యష్ ను విలన్ గా తీసుకున్నట్టు కూడా ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, అధికారికంగా మాత్రం ఇంకా ఏ ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రంలో విలన్ ఎవరు? లేదా ఇద్దరు విలన్లు ఉంటారా? అనే విషయం తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.