జూనియర్ ఎన్టీఆర్ వాచ్ 2 కోట్లా?

SMTV Desk 2018-12-29 17:07:31  SS Rajamouli, Son Marriage, Jr NTR, Watch cost

హైదరాబాద్, డిసెంబర్ 29: మాములుగా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపిస్తుంటారు. తాజాగా రాజమౌళి కుమారుడి పెళ్లి సందర్భంగా హీరోలు అందరు రాజస్థాన్‌ చేరుకున్నారు. ఈ సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్ పై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ చేతికి ఉన్న గడియారం ధర తెలుసుకొని అవాక్కవుతున్నారు. ఆ వాచ్ రిచర్డ్ మెల్లే మెక్ లారెన్ కంపెనీదని తెలుస్తోంది. ఎఫ్ వన్ రేసుల్లో పాల్గొనేవారు అత్యంత ఖరీదైన ఈ వాచ్ లను ధరిస్తుంటారు. దీని ధర అక్షరాలా రూ. 2.20 కోట్లు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.