పెళ్లిలో స్టార్ హీరో ల చిందులు... !!

SMTV Desk 2018-12-29 13:05:51  SS Rajamouli, Son Marriage, Prabas, NTR, Ram Charan, Dance

జైపూర్, డిసెంబర్ 29: దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ, జగపతిబాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్‌ల వివాహం రేపు (డిసెంబర్‌ 30) జరగనుంది. ఈ వేడుకను జైపూర్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌ వేదికగా జరుపుతున్నారు.. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు జైపూర్ చేరుకుని, సందడి చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి, జగపతిబాబులతో కలసి జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, రానా, అనుష్క, నానిలు ఉత్సాహంగా స్టెప్పులు వేశారు.