ఏడో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఏపీ సీయం

SMTV Desk 2018-12-29 12:57:54  AP, CM, Chandrababu, Amaravaati, Release White papers, Oil industries, Energy & Infrastructure

అమరావతి, డిసెంబర్ 29: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఇంధన రంగం-మౌలిక వసతుల కల్పనపై ఏడో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి తొలిదశలో రూ.51 వేల కోట్లు, రెండో దశలో రూ. 50 వేల కోట్లు అవసరం అవుతాయని అన్నారు. అంతే కాకుండా 2 మిలియన్ల మందికి ఉద్యోగాలు సృష్టించే నగరం అమరావతి అని పేర్కొన్నారు. ఎస్ఆర్ఎం, అమృత్, విట్ వంటి వర్సిటీలు వచ్చాయని చెప్పారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తున్నాయన్నారు. అమరావతిని ఎడ్యుకేషన్, హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సిఎం స్పష్టం చేశారు. 80 వేల హోటల్ గదులు రాజధానికోసం అవసరమని, 2400 కిలో మీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేశామని చెప్పారు. 11 జాతీయ రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. 130 వంతెనలు కొత్తగా నిర్మాణంలో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు.