క్యాబినెట్‌ విస్తరణ పై ఎమ్మెల్యేల ఎదురుచూపులు...!!!

SMTV Desk 2018-12-28 19:01:04  Telangana state government, Cabinet separation, TRS, KCR, KTR, Harish rao, Mahaboob ali, Balka suman

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల అందరికళ్ళు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పై పడింది. ప్రతి వొక్క ఎమ్మెల్యే క్యాబినెట్‌లో ఎవరెవరికి స్థానం లభింస్తుందనే దాని పై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వివిధ రాష్ట్రాల పర్యటన తర్వాత ఇవాళ హైదరాబాద్‌కు రానున్న కేసిఆర్‌.. కేబినెట్‌పై కొంత స్పష్టత రావచ్చని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారు. ఇప్పటికే కేసిఆర్‌, మహబూబ్‌ అలీ కేబినెట్‌లో ఉండగా ఇంకా 16 మందికి అవకాశం ఉండొచ్చు. ఆ 16లో కూడా హరీశ్‌రావు, కేటిఆర్‌లకు మంత్రి వర్గంలో చోటు ఉండవచ్చని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. జనవరి 3లోగా మొదటి విడతలో ఎనిమిది మందికి చోటు దక్కవచ్చని , స్థానిక ఎన్నికల తర్వాత తుది విడత కాబినెట్‌ విస్తరణ ఉంటుందని నేతలు భావిస్తున్నారు. కేబినెట్‌లో చోటు కోసం ఇప్పటికే కేటిఆర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు పలువురు నేతలు. వారిలో ముఖ్యంగా ఎర్రబెల్లి దయాకరరావు, పువ్వాద అజ§్‌ుకుమార్‌, కొప్పుల ఈశ్వర్‌, లక్ష్మారెడ్డి, బాల్క సుమన్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు కేటిఆర్‌ను కలిసి తమకు అవకాశం దక్కేలా చూడాలని కోరినట్లు సమాచారం. కేటిఆర్‌ చుట్టూ ప్రదక్షిణలు చేయడంలో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. కేసిఆర్‌ నగరానికి చేరుకోగానే మంత్రి వర్గ విస్తరణపై స్పష్టత వస్తుందని నేతల ఆకాంక్ష.