రాష్ట్రానికి జనాభా పెరగాల్సిన అవసరముంది : చంద్రబాబు

SMTV Desk 2018-12-28 16:41:03  AP, CM, Chandrababu, Population growth rate, Decreasing

అమరావతి, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్ జనాభా తగ్గిందని రాష్ట్రానికి జనాభా పెరుగుదల ఎంతో అవసరమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇవ్వాల విద్య, వైద్య, కుటుంబ సంక్షేమం పై ఆరో శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత పదేళ్లుగా ఏపిలో జనాభా పెరుగుదల రేటు తగ్గిందని, జనాభా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే ఆరోగ్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వైద్య రంగంలో 24 పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సియం ఆరోగ్య కేంద్రాలు ఎన్టీఆర్‌ ఆరోగ్య కేంద్రాలు, ఎన్టీఆర్‌ బేబి కిట్స్‌, చంద్రన్న సంచార చికిత్స పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పేదవాళ్లకు ఉచితంగా డయాలసిస్‌ తో పాటు రూ. 2500 పింఛను ఇస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంతానంపై నిబంధనను తొలగిస్తామని చంద్రబాబు తెలిపారు.