ఇస్రోలో భారీ అగ్ని ప్రమాదం.!

SMTV Desk 2018-12-28 16:03:07  ISRO, Ahmedabad, Fire Accident

అహ్మదాబాద్‌, డిసెంబర్ 28: అహ్మదాబాద్‌లోని ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) ప్రాంగణంలో స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసి) నెంబరు 37-ఎ నిర్మాణ పరిశోధనలో ఈరోజు మధ్యాహ్నం గం.1.30 సమయంలో వొక పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 25 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. స్టోర్‌ రూమ్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఇక్కడ స్టేషనరీ వస్తువులను ఉంచుతారని తెలిసింది. అయితే ప్రమాదానికి గల కారణాలతో పాటు ఘటనకు సంభందించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.