రాష్ట్రపతిని కలిసిన సీఎం కేసీఆర్

SMTV Desk 2017-07-27 15:48:08  CM KCR, PRIME MINISTER RAAMNAATH KOVINDH, MEETING

హైదరాబాద్, జూలై 27 ː తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా న్యూఢిల్లీ వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిసి కొన్ని అంశాల గురించి వివరించారు. ఇంటింటికి మంచినీరు అందేలా, భూగర్భ జలాలు పెరిగేలా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాలు చేపట్టామని అంతేకాకుండా రాష్ట్రంలో జీడీపీ 21.5 శాతంతో దేశంలోనే ముందు వరుసలో ఉందని రాష్టపతికి వివరించారు. కాగా రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతు తెలిపినందుకు కేసీఆర్ కు రాంనాథ్ కోవింద్ కృతజ్ఞతలు తెలుపుతూ, తెలంగాణా రాష్ట్ర అభివృద్దికి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.