తెలంగాణ ప్రభుత్వానికి మరో గుర్తింపు

SMTV Desk 2018-12-28 14:01:17  Telangana state governament, Medical services, Niti ayog

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య రంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. జాతీయస్థాయిలో ఆయా రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్యసేవలు అందించడంతో నీతి ఆయోగ్‌ రూపొందించిన నివేదికలో తెలంగాణ మూడోస్థానంలో ఉంది. వైద్య ఆరోగ్యరంగంలో వివిధ అంశాల ఆధారంగా 65కు పైగా పాయింట్లు సాధించిన రాష్ట్రాలను అత్యుత్తమ సేవలందిస్తున్నవిగా గుర్తించారు. 92 పాయింట్లతో కేరళ మొదటి స్థానంలో, 77 పాయింట్లతో తమిళనాడు రెండోస్థానంలో ఉండగా 73 పాయింట్లతో తెలంగాణ మూడోస్థానంలో నిలించింది.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వైద్యరంగం పురోగతికి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, వినూత్న కార్యక్రమాల అమలువల్లే తెలంగాణ ప్రత్యేకతను చాటుకున్నది. పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మణిపూర్, పశ్చిమబెంగాల్, గోవా రాష్ర్టాలు వరుసగా 4, 5, 6, 7, 8, 9 స్థానాల్లో నిలిచాయి.